- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: స్థానిక ఎన్నికలపై బిగ్ అప్ డేట్.. సీఎంతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో నిర్వహించబోతున్నది. ఈ మేరకు పీఏసీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు సూచించారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. అయితే సరిగ్గా వారం క్రితం సీఎంతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ నెల 16న లేదా 17న పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ అది జరగలేదు. తాజాగా ఈ ఇరువురు మరోసారి సమావేశం కావడం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది.
ముందుకు వెల్తారా? గడువు కోరుతారా?:
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ వచ్చె నెలాఖరులోపున ఈ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో ఎన్నికలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది ఆసక్తి రేపుతున్నది. అయితే తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. తాజాగా ఆయన ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కోర్టు చెప్పినట్లు సెప్టెంబర్ నెలాఖరుకు ఎన్నికలు పూర్తి చేయాలి కానీ ఆ పరిస్థితి లేనప్పుడు గడువు కోరతామన్నారు. రిజర్వేషన్లు తేలని కారణంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. పీఏసీ సమావేశంలో వచ్చే మెజార్టీ అభిప్రాయాల ప్రకారం ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దీంతో పీఏసీ సమావేశంలో అధికార పక్షం ఎన్నికలకు సై అంటుందా లేక కోర్టును వాయిదా కోరుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
ఆశావహుల్లో నిరాశ:
ఎన్నికల నిర్వహణ విషయంలో జాప్యం జరుగుతుండటంపై క్షేత్ర స్థాయిలో ఆశావహుల్లో నిరాశ నెలకొంటున్నది. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేనందునా నిధుల విడుదల చేయలేమని కేంద్రం చెబుతోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి పీఏసీ సమావేశంపై ఉంది.






