గౌడ, బీసీ నాయకులతో పీసీసీ చీప్​మహేష్ కుమార్ గౌడ్ భేటీ

by Muthe.Rajitha |

గౌడ సంఘం నేతలు, కులస్తులు, బీసీ నాయకులతో టీ పీసీసీ అధ్యక్షులు మహేశ్​ కుమార్ ​గౌడ్​ సోమవారం నాడు భేటీ అయ్యారు.

గౌడ, బీసీ నాయకులతో పీసీసీ చీప్​మహేష్ కుమార్ గౌడ్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : గౌడ సంఘం నేతలు, కులస్తులు, బీసీ నాయకులతో టీ పీసీసీ అధ్యక్షులు మహేశ్​ కుమార్ ​గౌడ్​ సోమవారం నాడు భేటీ అయ్యారు. ఖమ్మం పట్టణంలో నిర్మించబోయే గౌడ సంఘం భవనం నిర్మాణం, ఇందుకు నిధుల గురించి పిసిసి చీఫ్ తో గౌడ్ సంఘం నేతలు చర్చించారు. గౌడ సంఘం భవనం నిర్మాణం పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి చర్చించి ఫండ్స్ ఇప్పించే బాధ్యత నాదే నని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. తాను కూడా గౌడ్ గా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. గౌడ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాల్సిన ఆవసరం ఉందన్నారు. ఖమ్మంలో నిర్మించబోయే గౌడ్ సంఘ భవనం భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలు, గౌడ్​లు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కుల గణనను పారదర్శకంగా పూర్తి చేయించారన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని కుల సర్వే తో తేలిందన్నారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. కాంగ్రెస్​వర్కింగ్ ప్రెసిడెంట్ గా కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ ప్రవేశ పెట్టానని, కుల సర్వే ,ఎస్సీ వర్గీకరణ తెలంగాణ కాంగ్రెస్ గొప్ప విజయాలేనన్నారు. కేంద్రం జనగణన తో పాటు కుల గణన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ప్రభుత్వ విజయం అని టీ పీసీసీ అధ్యక్షులు మహేశ్​కుమార్​గౌడ్​అన్నారు.

Next Story