TG News : మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

by Muthe.Rajitha |

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Electiona)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) చేసిన ప్రకటనలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తీవ్రంగా స్పందించారు.

TG News : మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Electiona)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) చేసిన ప్రకటనలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) తీవ్రంగా స్పందించారు. మంత్రి పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాట్లాడిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్‌లో చర్చించాల్సిన సున్నితమైన అంశం, దీనిపై ముందస్తు ప్రకటనలు చేయడం సరికాదని విమర్శించారు. ఈ ఎన్నికలు కోర్టు పరిధిలో ఉన్నాయని, అందువల్ల జాగ్రత్తగా మాట్లాడాలని, పార్టీతో సంప్రదించకుండా ఏ మంత్రి లేదా నాయకుడూ ఏకపక్షంగా ప్రకటనలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు.

ఒక మంత్రిత్వ శాఖకు సంబంధం లేని అంశంపై ఇతర మంత్రి మాట్లాడటం సముచితం కాదని, ఇది పార్టీలో అసమ్మతికి దారితీస్తుందని మహేష్ గౌడ్ హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న ఖమ్మం పర్యటనలో ఎన్నికల షెడ్యూల్, సంబంధిత వివరాలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటనపై మహేష్ గౌడ్ ఆక్షేపించారు. ఈ పార్టీ నాయకులు, మంత్రులు ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

Next Story