- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్
సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్: సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో మీనాక్షి నటరాజన్‌కు మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మరికొన్ని డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉందన్నారు.
స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఇప్పుడు ఫ్యాక్టరీలోకి పంపిస్తే పని జరగదు కాబట్టి ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఏదేమైనా సీఎం ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చినిపోయిన వారి కుటుంబాలను వారి పిల్లలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. అందరినీ ఆదుకుంటామని ఓపిక పట్టాలని కోరారు. పేలుడు ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను పంపించారని, ఢిల్లీ నుండి హుటాహుటిన వచ్చి ఆమె ఘటనాస్థలాన్ని పరిశీలించారని చెప్పారు.






