- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందు వాటికి సమాధానం చెప్పు.. జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ కౌంటర్
జీవన్ రెడ్డి విమర్శలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ, పొంగులేటిపై ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలన్నారు. జీవన్ రెడ్డి విమర్శలు ప్రజలు పట్టించుకునే పరిస్తితిలో లేరని CM రేవంత్ రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‍కు విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్‍పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు రేపైనా కలుస్తాయన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎవరు బాగుపడ్డది లేదని మార్పు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పోయిందన్నారు.
పొంగులేటిపై ఆధారాలు చూపండి:
మంత్రి పొంగులేటిపై వచ్చిన ఆరోపణలపై ప్రూఫ్స్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. పొంగులేటి పై విమర్శలు చేయడం కాదు ఆధారాలు ఉంటే గాంధీ భవన్‍కు వచ్చి ఇవ్వాలన్నారు. ఆధారాలు తీసుకొని వస్తే నేను చర్చకు సిద్ధం అన్నారు. పస లేని ఆరోపణలు చేయొద్దని నాదర్‍గుల్ భూముల కుంభకోణం బీఆర్ఎస్ హయంలోనే జరిగిందని ఆరోపించారు. మా మీద బట్ట కాల్చి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రులపై ఆరోపణలు సరికాదని హరీశ్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలన్నారు. మేము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎక్కడ గీత కూడా పడలేదని అదే మీరు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందన్నారు.
ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు:
మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశం అని నాకున్న సమాచారం ప్రకారం మంత్రి వర్గ విస్తరణలో ఇప్పట్లో ఉండదన్నారు. మేము అంతా కూడా ఎన్ఎస్‍యూఐ నుంచి వచ్చిన వాళ్ళమే ఇవాళ ఎన్ఎస్ యూఐ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీ చంద్ రెడ్డి, ఎంపీ అనిల్‍కుమార్ యాదవ్ , ఎస్సీ సెల్ చైర్మన్ శంకర్ నాయక్ అందరం కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్లమేనన్నారు. ఎన్ఎస్‍యూఐ నాయకత్వాన్ని అందిస్తున్న ఒక కంపెనీ లాంటిది. ఆ సంస్థ నుంచి మంచి అవకాశాలు వచ్చాయి. మేము అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేనన్నారు. ఎన్ఎస్‍యూఐ అధ్యక్షుడు వెంకటస్వామి నేతృత్వంలో మరింత బలోపేతంగా ముందుకు సాగాలని సూచించారు.
స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్






