- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Kumar Goud: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అవకాశం ఎక్కడుంది?: మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్, బీజేపీలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కాదా అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ కు హరీశ్ రావు సిద్ధం కావాలని అన్నారు. ఆధారాలతో సహా అన్ని లెక్కలను సభలోనే బయటపెడతారన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. గతంలో తెలంగాణ సీఎంగా ఉంటూ చంద్రబాబు, జగన్ తో చెట్టాపట్టాలేసుకుని ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. పక్కరాష్ట్రాలు బాగుపడితే మంచిదే కానీ మన రాష్ట్ర వాటా విషయంలో రాజీపడి ఇప్పుడు మాట్లాడుతారా అని మండిపడ్డారు. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెస్తేనే బనకచర్ల ఆగిందన్న విషయం హరీశ్ రావు గుర్తుంచుకోవాలన్నారు. మా ప్రభుత్వ ప్రయత్న తెలిసి కూడా అబద్ధాలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీకి బీసీ నాయకుడే దొరకలేదా?
బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మరేపార్టీకి లేదన్నారు. 56 శాతం బీసీలు ఉన్నారని నిరూపితమైన రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించుకోలేని బీజేపీ పార్టీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీలో సమర్థవంతమైన బీసీలు లేరా అని ప్రశ్నించారు. రేపు ఏం చేస్తామో చెబితే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. చెప్పింది ఇవాళ చేసి చూపినోడే మొనగాడని మేము సామాజిక నాయ్యం ఏంటో చేసి చూపాం. డిప్యూటీ సీఎంగా దళితుడు, పార్టీ అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇచ్చామని అన్నారు. రేపు ఎల్బీస్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి పేరిట కార్యక్రమం ఉంటుందని ఇందులో గ్రామ కమిటీలను ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ప్రసంగిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో సమన్యాయానికి కొరత లేదని అవకాశాలు రాని వారిగురించి పార్టీ ఆలోచన చేస్తున్నదన్నారు.
కవిత లేఖ హాస్యాస్పదం:
బీసీల గురించి కవి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని సెటైర్ వేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత (Kavitha) బీసీల గురించి మాట్లాడారా? ఇంతకు కవిత ఏ పార్టీలో ఉందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ కు ముఖం చాటేసిన కవిత కాంగ్రెస్ మాట్లాడితె ఎలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో మీ వాటాల పంచాయతీ తెగిందా? అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అవకాశం ఎక్కడుందని నిలదీశారు. బీఆర్ఎస్ ఏం చేసిందని ఆ పార్టీకి ప్రజలు ఓట్లే వేస్తారన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. కవిత రాజకీయ శూన్యంలో ఉందని ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.






