- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PCC Chief : ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్
ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Electionsలపై టీపీసీసీ అధ్యక్షు(PCC Chief)లు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్(Zoom Meeting) నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Electionsలపై టీపీసీసీ అధ్యక్షు(PCC Chief)లు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్(Zoom Meeting) నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల( ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ - కరీంనగర్) మండల అధ్యక్షులతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై మండల అధ్యక్షులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది వ్యవధిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని..భవిష్యత్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పట్టభద్రుల్లో, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కాంగ్రెస్ పట్ల నెలకొన్న సానుకూలతను పోలింగ్ లో ఓట్లుగా మలుచుకునేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని కోరారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి, నల్లగొండ,వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రేపు గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగునుంది. వచ్చే నెల 3వ తేదిన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.






