Congress: చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి.. కవితకు పీసీసీ చీఫ్ కౌంటర్

by Prasad Jukanti |

కవిత చేసిన వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

Congress: చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి.. కవితకు పీసీసీ చీఫ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC chief Mahesh Kumar Goud) కౌంటర్ ఇచ్చారు. కవిత అసలు పుట్టింది ఎప్పుడు? కవితకు చరిత్ర తెలుసా? అన్నారు. చరిత్ర తెలుసుకొని కవిత (Kavitha) మాట్లాడాలన్నారు. కవితకు విలీనం దినోత్సవంకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగా మాట్లాడతారని, కాంగ్రెస్ పార్టీలో కొంత మేర స్వేచ్ఛ ఉంటుందన్నారు. అలాగని రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న కొత్తపార్టీపై స్పందిస్తూ.. పార్టీలు ఎవరు పెట్టిన స్వాగితిస్తున్నామని, బీసీల కోసం పోరాడే నాయకుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను గౌరవిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించారు కాబట్టే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

Next Story