- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ శ్రేణులకు అలర్ట్.. ఈ నెల 21 నుంచి పీసీసీ అగ్రనేతల నియోజకవర్గాల పర్యటనలు
ఎస్‌ఐఆర్ పై బీఎల్ఏలకు శిక్షణ ఇచ్చేందుకు పీసీసీ అగ్రనేతలు నియోజకవర్గ పర్యటనలకు సిద్ధమయ్యారు

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు మరోసారి నియోజకవర్గాల బాట పట్టనున్నారు. ఈ నెల 21 నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ నియోజకవర్గ పర్యటనలు చేయబోతున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLAs) నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పీసీసీ అగ్రనేతలు ఇద్దరూ పాల్గొననున్నారు.ఈ నెల 21న మక్తల్ నియోజకవర్గంలో, ఈ నెల 23న ఆందోల్ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాల్లో మహేశ్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సీఎం అప్రమత్తం:
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. అనుమానాస్పదం పేరుతో ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఓట్లు తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓట్లు తొలగిపోతే తర్వాత చేసేదేం ఉండదన్నారు. ప్రతి గ్రామంలో బీఎల్‌వోలతో నాయకులు అనుసంధానమవ్వాలని బీఎల్‌వోలు వెళ్లినప్పుడు వలస వెళ్లిన ఓట్లర్లు అందుబాటులో ఉండరు. అలాంటి ఓట్లు తొలగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అగ్రనేతలు నియోజకవర్గాల పర్యటనలకు వెళ్లడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.
ఈ నెల 25 నుంచి ఎస్ఐఆర్:
కాగా, తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే చేపట్టనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ప్రకటించారు. అయితే ఈ ఎస్ఐఆర్ విషయంలో బీఆర్ఎస్ ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు మొదలు పెట్టగా ఈ కార్యక్రమం ద్వారా అసలైన ఓటర్లకు ఎలాంటి ప్రమాదం లేదని బీజేపీ వాదిస్తోంది.






