సస్టైనబుల్ ఆన్ వీల్స్ వాహనం పనితీరు భేష్ : పీసీబీ చీఫ్ రఘు

by Ramesh Naini |   (  Updated:2025-11-29 15:44:58  IST  )

వాహనం పనితీరు బాగుందని పీసీబీ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రఘు తెలిపారు.

సస్టైనబుల్ ఆన్ వీల్స్ వాహనం పనితీరు భేష్ : పీసీబీ చీఫ్ రఘు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్విచ్ ఈ కో సంస్థ స్థాపకుడు అక్షయ్ దేశ్‌పాండే, సహ-స్థాపకులు నాగరాజ్ యాదవ్, శ్రీనివాస మూర్తి, దిలీప్, అశుతోష్ సపోర్ట్ టీమ్‌తో కలిసి, సస్టెయినబులిటీ ఆన్ వీల్ వాహనాన్నిస్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో శనివారం ప్రదర్శించారు. సైట్‌లోనే వాహనాన్ని ఆపరేట్ చేసి, బేలింగ్, శ్రెడ్డింగ్, మొబైల్ రీసైక్లింగ్ వంటి ముఖ్య ఫీచర్స్‌ను లైవ్‌గా చూపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఈ ఆవిష్కరణను అభినందించి, సస్టైనబుల్ వెస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ఇలాంటి పరిష్కారాలను విస్తరించేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. సస్టైనబుల్ ఆన్ వీల్స్ వాహనం పనితీరు బాగుందని ఈ సందర్భంగా పీసీబీ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రఘు తెలిపారు.

వెహికల్ పనితీరు గురించి సంస్థ ప్రతినిధులతో ఆయన అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ విస్తరణకు ఉపయోగపడే విలువైన సూచనలను కూడా పంచుకున్నారు. ఇక, స్విచ్ ఈకో కంపెనీ ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేసిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. స్వచ్ఛమైన, స్మార్ట్ కమ్యూనిటీల కోసం ఆన్-సైట్ సస్టైనబుల్ సొల్యూషన్స్‌ను తీసుకెళ్లే దిశగా ఉపయోగపడుతుందని తెలిపారు.

Next Story