- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీసీబీ బోర్డు ఉత్తర్వులతో హెటెరో అబద్ధాలు బట్టబయలు.. టీపీజేఏసీ, కేవీపీసీ ప్రకటన
దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యానికి తమకు సంబంధం లేదని, తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని హెటెరో డ్రగ్స్ యాజమాన్యం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) జనవరి 1, 2026న జారీ చేసిన తాజా ఉత్తర్వులు నిరూపిస్తున్నాయని తెలంగాణ ప్రజా జేఏసీ(టీపీజేఏసీ) అధ్యక్షులు వై. అశోక్ కుమార్, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (కేవీపీసీ) కన్వీనర్లు మద్ది బాల్ రెడ్డి, మంగయ్య, శారద తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యానికి తమకు సంబంధం లేదని, తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని హెటెరో డ్రగ్స్ యాజమాన్యం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) జనవరి 1, 2026న జారీ చేసిన తాజా ఉత్తర్వులు నిరూపిస్తున్నాయని తెలంగాణ ప్రజా జేఏసీ(టీపీజేఏసీ) అధ్యక్షులు వై. అశోక్ కుమార్, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ (కేవీపీసీ) కన్వీనర్లు మద్ది బాల్ రెడ్డి, మంగయ్య, శారద తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇరు సంఘాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కంపెనీ గతంలో బోర్డు విధించిన షరతులను, జూలై 2021, జనవరి 2023, మే 2025 నాటి ఆదేశాలను బేఖాతరు చేస్తోందని బోర్డు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. కంపెనీలోని జేఎల్డీ (సున్నా వ్యర్థాల విడుదల) సిస్టమ్, ఏఎప్టీడీ, బయోలాజికల్ ఈటీపీ ప్లాంట్ల నుండి వెలువడుతున్న దుర్వాసనను అరికట్టడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైనట్టు బోర్డు తప్పుబట్టిందని చెప్పారు. గాలి కాలుష్యాన్ని నియంత్రించాల్సిన స్క్రబ్బర్లను సమర్థవంతంగా నిర్వహించడం లేదని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ధారించిందని వివరించారు. ఈ ఆదేశాలను పాటించకపోతే ఎయిర్ యాక్ట్ -1981 సెక్షన్ 31(ఏ) కింద ఎటువంటి నోటీసు లేకుండానే పరిశ్రమను మూసివేస్తామని బోర్డు తన ఉత్తర్వుల్లో హెటెరో యాజమాన్యాన్ని తీవ్రంగా హెచ్చరించినట్టు రెండు సంఘాల నేతలు తెలిపారు. జనవరి 11న నిర్వహించే ‘మహా ర్యాలీ’కి టీపీజేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
టీపీజేఏసీ, కేవీపీసీ డిమాండ్లు…
-ఒకవైపు బోర్డు కంపెనీని మూసివేస్తామని హెచ్చరిస్తుంటే, మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలో రహస్యంగా రైతులకు రూ.12 వేల చెక్కులు పంపిణీ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని టీపీజేఏసీ, కేవీపీసీ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు.
-కంపెనీ అంత సవ్యంగా ఉంటే, మీడియాను, గ్రామస్థులను కంపెనీ లోపలికి తీసుకెళ్లి జడ్ ఎల్డీ ప్లాంట్ పనిచేస్తున్నట్లు ఎందుకు చూపించడం లేదని ప్రశించారు.
-పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తూ మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునే వరకు మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించాయి.






