- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PC Ghosh: వచ్చే నెల 20 లోపు సమాధానం ఇవ్వండి.. పీసీ ఘోశ్ కమిషన్ నివేదికపై హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghose Commission) కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. ఈ కిమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ఇవాళ హైకోర్టు కలిపి విచారించింది. కేసీఆర్, హరీశ్‍రావు తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ సి. ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై ఇప్పటికే ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా ప్రభుత్వ కౌంటర్‍కు పిటిషనర్లు రిప్లయ్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల రిప్లయ్‍పై ప్రభుత్వం తరపున లిఖితపూర్వక సబ్‌మిషన్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ఫిబ్రవరి 20 లోపు లిఖితపూర్వక సబ్మిషన్ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 25 కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసువద్దన్న హై కోర్టు (Telangana High Court) స్పష్టం చేసింది.






