కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై లోపాలు ఉన్నాయి.. రిపోర్ట్ వెలుగులోకి

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-24 16:11:33  IST  )

కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project)పై పీసీ ఘోష్(PC Ghose) నివేదిక వెలుగులోకి వచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ NDSA (National Dam Safety Authority)కు రాసిన 378 పేజీల లేఖ వైరల్ అవుతోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై లోపాలు ఉన్నాయి.. రిపోర్ట్ వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project)పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority) లేఖ వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘ సమావేశాల అనంతరం రూపొందించిన 378 పేజీల లేఖ వైరల్ అవుతోంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మాణ లోపాలు కూడా స్పష్టంగా ఉన్నాయని ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. వెంటనే సరిచేయాల్సిన అవసరంపైన కూడా ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. మొత్తం 36 అత్యంత కీలకమైన సమావేశాల తర్వాత ఈ రిపోర్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రిపోర్టు త్వరగా ఇవ్వాలని ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ, కేంద్రం మాత్రం ఆ రిపోర్టును ఇంకా ఇవ్వకపోవడంపై పలు రకాల ఆరోపణలు వినిపించాయి.

ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. దాంతో అప్పటి నుంచి అక్కడ నీటి నిల్వ చేయడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ 2023, అక్టోబర్ 21న కుంగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ విచారణకు ఆదేశించించిన సంగతి తెలిసిందే.

Next Story