- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Payal Shankar: అందుకోసమే కాంగ్రెస్ పద్మ అవార్డులపై రాద్ధాంతం: పాయల్ శంకర్
కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కావాలనే పద్మ అవార్డులపై వివాదం రేపుతున్నారని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికలో రాజకీయ ప్రమేయం ఉండదని, అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ నేతలు పద్మ అవార్డుల (Padma Awards) పై వివాదం చేస్తున్నారని గద్దర్ మీద మాకు వ్యతిరేకత లేదన్నారు. ప్రజలకు నాలుగు పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది. గ్రామసభలు సైతం నిర్వహించింది. తీరా మండలానికి ఒక గ్రామంలో అమలు చేయడంతో ప్రజలు ప్రశ్నిస్తారనే పద్మ అవార్డులపై విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో సోనియా గాంధీ కుటుంబానికి లాయల్ గా ఉన్నవారికే అవార్డులు ఇచ్చారని ఆరోపించారు. మోడీ హయాంలో సామాన్యులను గుర్తించి పద్మ అవార్డులను ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 50 పేర్లు ఇస్తే 50 మందికి అవార్డులు రావన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ (Congress) కు ఓట్లు వేశారని అనవసర రాద్ధాంతాన్ని పక్కన పెట్టి హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలన్నారు. ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంచి జరిగితే మీ ఖాతాలో ఏదైనా వ్యతిరేకత వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఖాతాల్లో వేయాలనుకోవడం మంది పద్దతి కాదన్నారు.






