- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ రిజర్వేషన్లను ముస్లింలలో కలపడం సరికాదు : పాయల్ శంకర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(BJP MLA Payal Shankar) తీవ్ర విమర్శలు చేశారు. నేడు హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తున్నారని గొప్పలు చెబుతున్నారని, నిజానికి ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ వంచిస్తోందని మండిపడ్డారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ, బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం సరికాదని, ఇది బీసీల హక్కులను కాలరాసే కుట్ర అని పేర్కొన్నారు. చట్టబద్ధత లేకుండా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయడం న్యాయస్థానాల్లో నిలబడదని, గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్‌లో ఇలాంటి ప్రయత్నాలు విఫలమైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నిర్ణయంపై బీజేపీ పోరాడుతుందని, బీసీలకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని శంకర్ హెచ్చరించారు.






