గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-22 16:09:33  IST  )

రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, వృత్తిలో భాగంగా అనేక ప్రమాదాలకు గురవుతున్నారని,

గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, వృత్తిలో భాగంగా అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, వారికి ప్రభుత్వం ఎక్స్​గ్రేషియో ఎప్పుడు ఇస్తుందో తెలపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా హామీలే ఇస్తున్నారు తప్పా అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రమాదాలకు గురైన బాధితులకు రాష్ట్రప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా నిధులు విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కాలంలో దాదాపు 710 మంది గీత వృత్తిదారులు ప్రమాదాలకు గురి కాగా, వీరిలో 130 మంది గీత కార్మికులు చనిపోయారన్నారు. మరో 120 మంది శాశ్వత వికలాంగులయ్యారన్నారు. వీరికి రూ.12 కోట్ల 96 లక్షల నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నదన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Next Story