ప‌వ‌న్ ప‌ద్ద‌తిగా మాట్లాడ‌టం నేర్చుకో.. మంత్రి అడ్లూరి ఫైర్..!

by Ratna Kumari |

పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలని రాష్ట్ర సాంఘికా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

ప‌వ‌న్ ప‌ద్ద‌తిగా మాట్లాడ‌టం నేర్చుకో.. మంత్రి అడ్లూరి ఫైర్..!
X

దిశ, వెల్గటూర్ : పవన్ కళ్యాణ్ పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలని రాష్ట్ర సాంఘికా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. వెల్గటూర్ మండల కేంద్రంలో బుధవారం మంత్రి అడ్లూరి పుష్కరాల పనులపై అధి కారులతో సమీక్ష చేస్తూ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పవన్ చేసిన వ్యాఖ్యల పై ఫైర్ అవుతూ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ గడ్డమీద ఉంటూ తెలంగాణ మీ అయ్యాజాగీరా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సరైంది కాదని విమర్శించారు. తెలంగాణ ఆంధ్రాది అన్నదమ్ముల బంధం అని ఇక్కడి ప్రజలు బావిస్తున్నారు. ఆంధ్రులను ఇక్కడి వారు ఎప్పుడు అవమానించలేదని తెలిపారు. ప్రపంచంలో గొప్ప మనసున్న వారు తెలంగాణ ప్రజలు,ఇలాంటి ఆర్ట్ అఫ్ కైండ్ ఉన్న వారు ప్రపంచంలో ఎక్కడ లేరని గర్వంగా చెప్పారు . తెలంగాణ లోరాజకీయ సభకు అనుమతి ఇవ్వకపోతే, మీ అయ్య జాగీరా అని,అలాగే దళిత నాయకుడైనా దయాకర్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పై నోరు పారేసుకొని దిగజారుడు వ్యాఖ్యలు చేయటాన్ని మంత్రి అడ్లూరి ఖండించారు.

ప్రభుత్వం పర్మిష‌న్ ఇవ్వక పోవటానికి ఏవైనా కారణాలు ఉండొచ్చు. అయినా సమస్యలను అధిగమించి ప్రొసీజర్ ప్రకారం వెళ్లి సభకు అనుమతులు పొందటానికి అవకాశం ఉంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టె వి దంగా మాట్లాడటం సరైంది కాదని సూచించారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రులను ఎప్పుడు అవమాన పరుచకుండా అన్నదమ్ముళ్ల మాదిరిగానే బావించారని గుర్తు చేశారు. దేశంలో ఎవరికైనా ఎక్కడైనా కొత్త పార్టీలు పెట్టుకొని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఇతరులను కించ పరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొటీ చేయటం వల్ల మాకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఆయన ఒంటరిగా పోటీలో ఉన్నా.. పొత్తులతో వచ్చిన సరే అది ప్రజలు చూ సుకుంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో జనసేన పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీదే రెండో సారి విజయమని మంత్రి నొక్కి చెప్పటం విశేషం.

Next Story