- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pavan Kalyan : గూగుల్ సెర్చ్ టాప్ లో పవన్ కళ్యాణ్
2024 లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్(Google Search) సంస్థ మంగళవారం ప్రచురించింది.

దిశ, వెబ్ డెస్క్ : 2024 లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్(Google Search) సంస్థ మంగళవారం ప్రచురించింది. అయితే అందులో ఈ ఏడాది అత్యధికంగా వెతికన టాపిక్స్‌లో క్రికెట్ లవర్స్ఎంతో ఇష్టంగా చూసే ఐపీఎల్(IPL), టీ20 వరల్డ్ కప్(T20 World Cup) టాప్‌లో ఉన్నాయి. అయితే వీటితో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలూ ఉన్నాయని తెలుస్తోంది. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata) గురించి కూడా చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికొస్తే మూవీ లవర్స్ అయితే 'స్త్రీ2'(Sthree2), ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD'(Kalki 2898 AD), 'సలార్', 'హనుమాన్', 'మీర్జాపూర్', 'హీరామండీ' గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారని గూగుల్ వెల్లడించింది. ఎక్కువ మంది వెతికిన పర్సన్స్ లో.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్ ఫొగాట్(Vinesh Fogat) అగ్రస్థానంలో ఉందని గూగుల్ వెల్లడించింది. బిహార్‌కు చెందిన నీతీశ్ కుమార్, చిరాగ్ పాసవాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pavan Kalyan) కూడా టాప్‌లో ఉన్నారు. ఇవి కాకుండా ఎక్కువగా సెర్చ్ చేసిన మీమ్స్, మీనింగ్స్, దగ్గర్లోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను సిద్ధం చేసింది.
Read More...
Pawan Kalyan: యాక్షన్ మోడ్‌లో పవన్.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్






