- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామెడీ షోలో సెటైర్లు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం: వేదికపై నుంచి కమెడియన్ అనుదీప్ పరార్!
ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల తన పరిమితులు దాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల తన పరిమితులు దాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. కామెడీ పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా మాట్లాడటంతో ఆగ్రహించిన అభిమానులు ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అనుదీప్ తన షో మధ్యలోనే అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోలో అనుదీప్ కటికాల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన విడాకుల అంశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది విన్న పవన్ అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఒక ప్రజాప్రతినిధి, పైగా ఒక పెద్ద హీరో వ్యక్తిగత విషయాలను హాస్యం కోసం వాడుకోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే కాకుండా, టాలీవుడ్‌కు చెందిన మరికొందరు ప్రముఖులపై కూడా అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నటి నిహారికలపై సెటైర్లు వేసినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడటంతో అన్ని వర్గాల అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు.
షో నుంచి పరార్..
అనుదీప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన కొందరు అభిమానులు వేదిక వద్దకు దూసుకెళ్లి ఆయనను నిలదీసే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన అనుదీప్, తన ప్రాణాలను కాపాడుకోవడానికి షోను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి పరారయ్యారు. "కామెడీ పేరుతో ఒకరి వ్యక్తిగత జీవితంపై హద్దు దాటి కామెంట్స్ చేయడం ఏంటి?" అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీల కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం హాస్యం అనిపించుకోదని, ఇది కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో స్టాండప్ కామెడీ హద్దులపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.






