Patnam Narender Reddy: లగచర్ల ఘటనలో కీలక పరిణామం.. పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి

by Prasad Jukanti |

లగచర్ల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Patnam Narender Reddy: లగచర్ల ఘటనలో కీలక పరిణామం.. పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacharla Incident) అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని (Patnam Narendra Reddy) కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన కొండగల్ కోర్టు.. నరేందర్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతి రావడంతో నరేందర్ రెడ్డిని రేపు పోలీసులు చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ కు తరలించనున్నారు. రేపు, ఎల్లుండి ప్రశ్నించనున్నారు. కాగా ఈ కేసులో కుట్ర కోణం ఉందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే పట్నం నరేందర్ రెడ్డి అధికారులపైకి రైతులను ఉసిగొల్పారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని తమ కస్టడీ (Police Custody)లోకి తీసుకోబోతున్న పోలీసులు ఎలాంటి విషయాలు రాబట్టనున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

Next Story