- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

దిశ, డైనమిక్ బ్యూరో: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendra Reddy) కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్ లో రెండు ఎఫ్ఐఆర్ లను హైకోర్టు కొట్టివేసింది. లగచర్ల దాడి ఘటన (Lagacharla Incident)లో బొంరాస్ పేట పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఒకే ఘటనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని వాదించారు. ఒకే ఘటనపై వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోలీసుల తరపున ఏఏజీ రజనీకాంత్ వాదన వినిపిస్తూ లగచర్లలో జరిగిన దాడి ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు (High Court) ఈనెల 25న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శుక్రవారం తీర్పు వెలువరించింది.






