BRS సోషల్ మీడియా ఆరోపణల్లో నిజం లేదు..! ‘పేషంట్’ వీడియో విడుదల

by Ramesh Naini |

రసూల్‌పురా బస్తీ దవాఖానలో ఆఫియా బేగం అనే పేషెంట్‌కు ఎక్స్‌పైర్డ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కర్ చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలింది.

BRS సోషల్ మీడియా ఆరోపణల్లో నిజం లేదు..! ‘పేషంట్’ వీడియో విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Rasulpur Basti Hospital) రసూల్‌పురా బస్తీ దవాఖానలో ఆఫియా బేగం అనే పేషెంట్‌కు ఎక్స్‌పైర్డ్ ట్యాబ్లెట్స్ (Expired tablets) ఇచ్చారంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కర్ చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలింది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కర్ చూపించిన పేషెంట్ ఆఫియా బేగం గురువారం ఓ వీడియో విడుదల చేశారు. తాను రెగ్యులర్‌గా రసూల్‌పుర బస్తీ దవాఖానలో చికిత్స చేయించుకుంటానని ఆమె తెలిపారు.

ఈ నెల 21న జలుబు, జ్వరంతో బస్తీ దవాఖానకు వచ్చానని, వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న మందులను కూడా తీసుకొచ్చుకున్నానని ఆమె వెల్లడించారు. ఆ మందులనే బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కర్ తన దగ్గర్నుంచి తీసుకున్నారని ఆఫియా బేగం వివరించారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వర్కర్ చెప్పినదాంట్లో వాస్తవం లేదని, తనకు ఆ మందులు ఆ రోజు ఇవ్వలేదని ఆఫియా బేగం స్పష్టం చేశారు. ట్వీట్..

కాగా, హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలను సందర్శించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు మేరకు, కంటోన్మెంట్‌లోని రసూల్‌పురా బస్తీ దవాఖానాను బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. అందులో భాగంగా , ఒక రోగికి 3 నెలల క్రితం గడువు ముగిసిన మందులు వచ్చినట్లు వారు గుర్తించి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ ట్వీట్..

Next Story