పటేల్ రమేష్ రెడ్డి సొంతూర్లో.. BRS సర్పంచ్ గెలుపు

by Gantepaka Srikanth |

పటేల్ రమేష్ రెడ్డి సొంతూర్లో.. BRS సర్పంచ్ గెలుపు

పటేల్ రమేష్ రెడ్డి సొంతూర్లో.. BRS సర్పంచ్ గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్‌లుగా ఉన్నవారి స్వగ్రామాల్లో వారికి విరుద్ధంగా ఫలితాలు వస్తున్నాయి. తాజాగా.. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత ఊర్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. సూర్యాపేట రూరల్ బాలెంలలో BRS పార్టీ అభ్యర్థి 260 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డి గూడలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించింది. గ్రామంలో ఉన్న మొత్తం ఓట్లలో 972 ఓట్లు పోల్ కాగా.. 31 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి విజయం సాధించింది.

Next Story