- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాస్టర్‌పై కేసు.. ప్రేమ, పెళ్లి పేరుతో లక్షల్లో దోపిడీ!
దేవుడి బాటలో నడవాలని బోధించాల్సిన ఓ పాస్టర్, కామ కోరికలు, డబ్బు కక్కుర్తితో బరితెగించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేవుడి బాటలో నడవాలని బోధించాల్సిన ఓ పాస్టర్, కామ కోరికలు, డబ్బు కక్కుర్తితో బరితెగించాడు. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగినిని నమ్మించి, ఆమె నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా.. ప్రాణహాని తలపెట్టిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో 'లివింగ్ వే' చర్చి పాస్టర్ జోసెఫ్ సందీప్ వడేగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఉప్పల్‌లోని లివింగ్ వే చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న జోసెఫ్ సందీప్ వడేగర్, అక్కడకు వచ్చే ఓ ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్లాన్ ప్రకారం ఆమె నుంచి లక్షలాది రూపాయలు కాజేశాడు.
వెలుగులోకి పాస్టర్ 'లీలలు'
కొంతకాలంగా పెళ్లి విషయం ఎత్తినప్పుడల్లా సందీప్ తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. ఆమె ఆరా తీయగా పాస్టర్ అసలు రంగు బయటపడింది. సందీప్‌కు మరో వివాహితతో అక్రమ సంబంధం ఉందని, ఆమెతో కలిసి దుబాయ్, గోవా, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో విహరిస్తున్నాడని బాధితురాలు గుర్తించింది. తనను నిలదీసిన బాధితురాలికి నిందితుడు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ‘నువ్వు నా జీవితంలో ఉండాలంటే, నా స్నేహితుడి భార్య కూడా నాతోనే ఉంటుంది.. ఆమెను నువ్వు అంగీకరించాలి’ అంటూ వింత కండిషన్ పెట్టాడు. ఇక, విషయం బయటపడటంతో సందీప్ తన నిజస్వరూపం ప్రదర్శించాడు. బాధితురాలిని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ మోసం వెనుక సికింద్రాబాద్‌కు చెందిన మరో పాస్టర్ హస్తం కూడా ఉందని, అతని అండతోనే సందీప్ ఈ అకృత్యాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు అందించిన ఆధారాల మేరకు ఉప్పల్ పోలీసులు పాస్టర్ జోసెఫ్ సందీప్ వడేగర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






