- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మరింత చేరువలో పాస్‌పోర్టు సేవలు
శేరిలింగంపల్లి ప్రజలకు పాస్‌పోర్టుకు సంబంధిత సేవలు మరింత చేరువలో, వేగవంతంగా అందుబాటులోకి వస్తాయని, ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు

ప్రజలకు మరింత చేరువలో పాస్‌పోర్టు సేవలు
- రాయదుర్గంలో సరికొత్త పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు
- ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీఏసీ చైర్మెన్ ఆరెకపూడి గాంధీ, తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ కే జై శ్రీనివాస, సిపిఓ, రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని హంగులతో సకల సౌకర్యాలతో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శేరిలింగంపల్లి ప్రజలకు పాస్‌పోర్టుకు సంబంధిత సేవలు మరింత చేరువలో, వేగవంతంగా అందుబాటులోకి వస్తాయని, ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాస్‌పోర్ట్ అనేది భారతీయుల అంతర్జాతీయ గుర్తింపు పత్రం అని, అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఏర్పడే ముందే యువత పాస్‌పోర్ట్ తీసుకోవాలని సూచించారు. కొత్త భవనంలో రోజుకు 1000 స్లాట్లు అందుబాటులో ఉండడం వల్ల సేవల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రం శేరిలింగంపల్లి ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు, అత్యవసర అవసరాల సమయంలో వేగవంతమైన సేవలు అందించేలా రూపుదిద్దుకుందన్నారు. 2014లో దేశవ్యాప్తంగా 110 పాస్‌పోర్టు సేవా కేంద్రాలుండగా, నేడు ఆ సంఖ్య 550కు పైగా పెరగడం ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించిందని, పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియను సులభతరం చేసి వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు షేక్‌పేట్ లోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో కొనసాగుతున్న పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఇప్పుడు రాయదుర్గం సిరి బిల్డింగ్‌లోకి మార్చామని అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో మంగళవారం ప్రారంభమైన ఈ కేంద్రం ఇకపై పూర్తిస్థాయిలో ప్రజలకు అన్ని సేవలను అందిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






