- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమానం కోసం విజయ్ దేవరకొండ సహా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పడిగాపులు.. శంషాబాద్ లో ఘటన
by Prasad Jukanti |
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్‌రాజ్‌కు (Prayag Raj) వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (Spice Jet Flight) సుమారు ఐదు గంటలుగా టేకాఫ్ కాకపోవడంతో విమానంలోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాలతో టేకాఫ్ కాలేదు. వేలకు వేలు పోసి టికెట్ కొన్నా ఇప్పటి వరకు విమానంలో వెయిట్ చేయిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. అయితే ఈ విమాన ప్రయాణికుల్లో నటుడు విజయ్ దేవరకొండతో పాటు ఇద్దరు ఐఏఎస్‌లు, 8 మంది ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కాసేపట్లో విమానం బయలుదేరుతుందని విమానయాన సంస్థ తెలిపింది.
Next Story






