ప్రయాణికుల రద్దీ పెరిగింది.. ఆర్టీసీలో డీజిల్ కొరతపై స్పందించిన సంస్థ ఎండీ నాగిరెడ్డి

by Ramesh Naini |

ఆర్టీసీలో సైతం డీజిల్ కొరత ఏర్పడిందని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజిల్ కొరతపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించారు.

ప్రయాణికుల రద్దీ పెరిగింది.. ఆర్టీసీలో డీజిల్ కొరతపై స్పందించిన సంస్థ ఎండీ నాగిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెంది పెంట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్‌లు కట్టడం మొదలు పెట్టారు. ఓ పక్క పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ సంస్థలు ప్రకటిస్తున్న కూడా పెట్రోల్ బంకుల్లో వాహనాదారులు క్యూ కడుతూనే ఉన్నారు. అలాగే ఆర్టీసీలో సైతం ఇంధన కొరత ఏర్పడిందని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజిల్ కొరతపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీలో డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రతి డిపోలో కూడా 40 వేల లీటర్ల కెపాసిటీ బంకులు ఉన్నాయని, ప్రతి రోజూ 30 ట్యాంకర్ల డీజిల్ వాడుతున్నామని అన్నారు.

ఏసీ, డీలక్స్ బస్సుల్లో రాయితీ

గత మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలోనే దాదాపు లక్ష మంది ప్రయాణికులు పెరిగారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొరతపై అపోహలు వద్దు.. సమ్మర్ ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ ఇస్తున్నామని అన్నారు. అలా రాయితీ ప్రకటించిన మూడు రోజుల్లోనే ప్రయాణికుల రద్దీ పెరిగిందని చెప్పుకొచ్చారు.

Next Story