- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‍పై పిడిగుద్దులతో దాడి (వీడియో)
బస్సు ఆపలేదనే కోపంతో ఆర్టీసీ డ్రైవర్‍పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకు వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికులకు, ఆర్టీసీ డ్రైవర్లకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బస్సులు సరిగా ఆపడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తుంటే ఓవర్ లోడ్‍తో పాటు ఇతర కారణాలతో ఆపడం లేదని డ్రైవర్లు వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నల్గొండలో బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‍పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నల్గొండ నుంచి దిల్‍సుఖ్‍నగర్ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఆపలేదని సదరు ప్రయాణికుడు డ్రైవర్‍ను రోడ్డుపై పడేసి పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో డ్రైవర్ రామ్ కుమార్ స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో దాడి చేసిన వ్యక్తిపై డ్రైవర్ నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ పై దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






