- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాశమైలారం ఘటన.. 39కి పెరిగిన మృతుల సంఖ్య
పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన.. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్‌డెస్క్: పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో (Sigachi Industries) జరిగిన పేలుడు ఘటన.. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 38 మంది మృతి చెందగా.. తాజాగా ఆ సంఖ్య 39కి పెరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ధృవ ఆస్పత్రిలో (Dhruva Hospital) చికిత్స పొందుతూ మరో కార్మికుడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమ్ రావుగా గుర్తించారు.
ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడగా.. 31 మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో 23 మంది చికిత్స పొందుతుండగా.. 9 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని, ప్రమాద స్థలంలో వారికోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా.. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అవ్వడంతో సిగాచీ సంస్థ యాజమాన్యం స్పందించింది. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.






