పాశమైలారం ఘటనలో 42కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 8 మంది ఆచూకీ?

by Naga Rani Yarlagadda |

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని (Pashamylaram) సిగాచీ కంపెనీలో బ్లాస్ట్ (Sigachi Blast) ఘటనలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

పాశమైలారం ఘటనలో 42కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 8 మంది ఆచూకీ?
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని (Pashamylaram) సిగాచీ కంపెనీలో బ్లాస్ట్ (Sigachi Blast) ఘటనలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం ధృవ ఆస్పత్రిలో (Dhruva Hospital) జితేందర్ వ్యక్తి మరణించడంతో మృతుల సంఖ్య 41కి చేరగా.. మధ్యాహ్నం మరో వ్యక్తి మరణించడంతో 42కి చేరింది. ప్రమాదం జరిగి వారంరోజులైనా.. ఇంకా 9 మంది ఆచూకీ పూర్తిగా లభ్యం కాలేదు. ప్రమాద స్థలంలో ఒకరి శరీర భాగాలు లభ్యమయ్యాయి. మరో 8 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉండగా.. బంధువులంతా ప్రమాద స్థలంలోనే వేచి చూస్తున్నారు. తమవారి ఆచూకీ చెప్పండని కనిపించిన వారందరినీ అడుగుతున్న తీరు చూస్తే గుండెల్ని కలచివేస్తుంది.

Next Story