Gutha Sukhender Reddy : ప్రజాప్రతినిధులకు..ప్రజలకు మధ్య దూరం పెరగడానికి వాళ్లే కారణం : మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-11 08:38:02  IST  )

ప్రజాప్రతినిధులకు..ప్రజలకు మధ్య దూరం పెరగడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వో(PAs and PRO)లు ప్రధాన కారణమవుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukhender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Gutha Sukhender Reddy : ప్రజాప్రతినిధులకు..ప్రజలకు మధ్య దూరం పెరగడానికి వాళ్లే కారణం : మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాప్రతినిధులకు..ప్రజలకు మధ్య దూరం పెరగడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వో(PAs and PRO)లు ప్రధాన కారణమవుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukhender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీలో శాసన సభ, మండలి సభ్యుల ఓరియెంటేషన్ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ విలువైన సూచనలతో కూడిన ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడేందుకు ప్రజలు లేక మరెవరైనా ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్వోలు దురుసుగా మాట్లాడతారని, తద్వారా వారిపై కోపం ప్రజాప్రతినిధులపై కోపంగా మారిపోతుందన్నారు. గన్ మెన్‌లతో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోందన్నారు. గెలవగానే పక్కకి వచ్చి చేరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, కాబట్టి స్వయంగా ప్రజాప్రతినిధులే ప్రజలతో ఫోన్ లో టచ్ లో ఉండాలని గుత్తా సూచించారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. గాలివాటం రాజకీయాలు మొదలయ్యాక కొత్త ఎమ్మెల్యేలే సభలోకి వస్తున్నారన్నారు. ఎన్నికలు ఖరీదైనవిగా మారిపోయాయన్నారు. మేం సభాపతిగా ఉన్నా సభ ఎన్ని రోజులు నడపాలనే నిర్ణయం ప్రభుత్వానిదేనని, ప్రభుత్వం ఎక్కువ రోజులు సభ నిర్వహించాలనుకుంటే ఎక్కువ రోజులు నడుస్తుంది’’ అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటరీయన్ మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుందన్నారు. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునేవారన్నారు. మళ్లీ అలాంటి అర్ధవంతమైన చర్చలతో కూడిన సమావేశాలు జరుగాలని ఆకాంక్షించారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister for Legislative Affairs Sridhar Babu) మాట్లాడుతూ శాసనసభ ఏ ఒక్కరిదో కాదని... ఈ ట్రైనింగ్ సెషన్స్‌కు అందరికీ ఆహ్వానం పంపామని తెలిపారు. శాసనసభ అందరికీ అని... కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌దో వేరే ఇంకా ఎవరిదో కాదన్నారు. పాత రోజుల్లో సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా... సభలో ఎవరి పాత్ర వారు పోషించారన్నారు. మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారని, వారికి సీనియర్ సభ్యులు ఆదర్శంగా ఉండాలన్నారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందని, ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూసేవాళ్లమన్నారు. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలని, ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండటం రాజ్యాంగ విలువలను అవహేళన చేయడమేనన్నారు.

Next Story