- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండల కేంద్రంలో దొంగనోట్ల కలకలం..
by Bhanu |
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.

X
దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మండల కేంద్రానికి చెందిన దుర్గా శ్రీ వైన్ షాప్ లో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం కొనుగోలు చేశారని వారు ఇచ్చిన డబ్బుల్లో దొంగ నోట్లు వచ్చినట్లు మీడియా కు తెలిపారు. మండల ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని షాప్ నిర్వాహకులు సూచించారు. తమ వ్యాపారంలో వచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లగా బ్యాంకు అధికారులు రెండు నకిలీ వంద రూపాయల నోట్లు, ఒకటి ఐదు వందల రూపాయల నోటు గుర్తించినట్లు తెలిపారు. నకిలీ నోట్లు మండలంలో చలామణి చేస్తున్నారనే సమాచారం మండలంలో కలకలం రేపింది. ప్రజలు, రైతులు, వ్యాపారవేత్తలు నోట్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Next Story






