- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti: ప్రజలు మనపై ఆశలు పెట్టుకున్నారు: పొంగులేటి
by Prasad Jukanti |
కాంగ్రెస్ కార్యకర్తలకు పొంగులేటి తీపి కబురు చెప్పారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్టీని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రస్తుతం ఎలాగైతే అండగా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మేమంతా ప్రతి కార్యకర్త ప్రతి అడుగులో తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు భరోసా, భద్రత కల్పించి వారికి అండదండగా ఉంటామన్నారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రజలు మనపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారని చెప్పారు.
Next Story






