- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోనాల పండుగలో పార్టీ జెండాలు.. ఆ ఊర్లో తీవ్ర ఉద్రిక్తత
by GSrikanth |
మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం రాందాస్‌గూడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం రాందాస్‌గూడలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వల్ప వివాదం చోటుచేసుకుంది. దీంతో పార్టీల జెండాలు తొలగించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కుదరదు అని కాంగ్రెస్ శ్రేణులు తేల్చి చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి తీవ్రరూపం దాల్చి ఇరువరు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గ్రామస్తులు వారికి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు.
Next Story






