- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills By-Election: బీ-ఫామ్‌తో పాటు రూ.40 లక్షల చెక్కు ఇచ్చిన కేసీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్(KCR) బీ-ఫామ్ అందజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్(KCR) బీ-ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరపున 40 లక్షల రూపాయలు చెక్కును అందించారు. ఈ సందర్భంగా దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ కేటాయించింది. గోపినాథ్మీద సానుభూతితో విజయం సాధిస్తామని గులాబీ పార్టీ అంచానా వేస్తున్నది. మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.






