- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Rammohan : కేసీఆర్ కు దమ్ముంటే ఆ పని చేయాలి : ఎమ్మెల్యే రామ్మోహన్
పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్(Congress MLA Rammohan) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కు సవాల్ విసిరారు.

దిశ, వెబ్ డెస్క్ : పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (Congress MLA Rammohan Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కు సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ ఎంత అయిందో బహిరంగ చర్చకు రావాలని రామ్మోహన్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు దమ్ముంటే శివరెడ్డిపల్లికి రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సవాల్ చేశారు. కేసీఆర్ ఇక్కడికి వస్తే ఎవరి ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ జరిగిందో బహిరంగంగా తేల్చుకుందామని ఫైర్ అయ్యారు. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే తాము రూ.1000 కోట్ల రైతు రుణమాఫీ చేశామని వెల్లడించారు. సోషల్ మీడియాలో కేటీఆర్ ఎంత బురద జల్లినా జనం నమ్మరని.. వారికి వాస్తవం ఏమిటో తెలుసని అన్నారు. కేటీఆర్(KTR), కవిత(Kavitha), హరీష్ రావు(Harish Rao) లాటరీ బ్యాచ్ అని ఈ సందర్భంగా రామ్మోహన్ ఎద్దేవా చేశారు.
కాగా గత శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే ఒక హిస్టరీ అని, లాటరీలో రేవంత్ సీఎం అయ్యాడని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందంటే తాను ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేయడం కాదు, రాజకీయ సన్యాసం తీసుకొనిపోతా’నని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని రేవంత్ అంటున్నడు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు కాదు.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా నువ్వు లగచర్లకు ఒక్కడివే రా.. నువ్వు వస్తవో? రావో? నాకు తెల్వదు కానీ నేను మాత్రం కొడంగల్‌కు వస్తా.. నీకు దమ్ముంటే ఆపుకో’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కాగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్, కేసీఆర్ కు సవాల్ విసిరారు.






