‘జూబ్లీహిల్స్‌’లో పారామిలిటరీ బలగాలతో బందోబస్తు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం ముగిసింది. దాదాపు 14 రోజుల పాటు మూడు ప్రధాన పార్టీలు(కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) హోరెత్తించాయి.

‘జూబ్లీహిల్స్‌’లో పారామిలిటరీ బలగాలతో బందోబస్తు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ప్రచారం ముగిసింది. దాదాపు 14 రోజుల పాటు మూడు ప్రధాన పార్టీలు(కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) హోరెత్తించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కేటీఆర్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. సరిగ్గా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వం ముగిసింది. 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్, 14న కౌంటింగ్ జరుగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 4,01,365 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్టమైన నిఘా పెట్టారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రచార పర్వం ముగిసిన వెంటనే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపి బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎల్లుండి పోలింగ్ ముగిసేవరకు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story