Paradise Free Biryani: రిపబ్లిక్ డే సందర్భంగా ప్యారడైజ్ ఫ్రీ బిర్యానీ ఆఫర్.. తిన్నోళ్లకి తిన్నంత!

by Phanindra |

తాజాగా, ఈ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ ను ప్రకటించింది.

Paradise Free Biryani: రిపబ్లిక్ డే సందర్భంగా ప్యారడైజ్ ఫ్రీ బిర్యానీ ఆఫర్.. తిన్నోళ్లకి తిన్నంత!
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది బిర్యానీని ( Biryani ) ఇష్టంగా తింటారు. పార్టీ ఏదైనా సరే .. బిర్యానీ ఉండాల్సిందే. వరల్డ్ వైడ్ గా ఈ స్పెషల్ డిష్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొందరు అయితే, ప్లేట్ లో బిర్యానీని వడ్డిండమే ఆలస్యం వెంటనే లాగించేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు దీనిని ఇష్టపడతారు. అందులో ప్యారడైజ్ బిర్యానీ అంటే మెతుకు కూడా వదలకుండా తినేస్తారు.

టేస్ట్, క్వాలిటీ పరంగా ప్యారడైజ్ బిర్యానీకి ( paradise Biryani ) ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. దాని వలనే ప్రజల ఆదరణ కూడా పెరిగింది. ఇప్పుడు, మరింత దగ్గరవ్వడానికి ఎవరూ ఊహించని విధంగా కొత్త ఆఫర్ తో ప్యారడైజ్ మన ముందుకొచ్చింది. తాజాగా, ఈ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ ను ప్రకటించింది.

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా తమ కస్టమర్లకు ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎలాంటి డబ్బును తీసుకోకుండా ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ను నేరుగా పొందవచ్చని తెలిపింది. అయితే, ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ డైన్-ఇన్‌లో మాత్రమే వర్తిస్తుంది. అంటే రెస్టారెంట్‌లో కూర్చోని తినేవారికి మాత్రమే. పార్శిల్ తీసుకువెళ్లేవారికి ఇది వర్తించదు. ఈ నెల 24 నుంచి 26 వరకు అందుబాటులో ఉండనుంది. ఫ్రీ గా బిర్యానీ ఇస్తున్నారంటే ఎలాంటి మెలిక పెట్టకుండా అయితే ఇవ్వరు కదా.. ఇక్కడ కూడా అలాంటిదే ఉంది. మీరు ప్యారడైజ్ పాత కస్టమర్లు అయితే వారి సర్కిల్ నుంచి మీ వాట్సప్ నెంబర్‌కు ఈ బిర్యానీకి ఆఫర్ మెస్సేజ్ వస్తుంది. ఆ మెస్సేజ్‌ను (REP-KV915) మీకు దగ్గరలో ఉన్న ఏ ప్యారడైజ్ రెస్టారెంట్‌కు వెళ్లి చూపించినా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Next Story