- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ కార్యదర్శుల స్పోర్ట్స్ కోటా ఫలితాలు విడుదల
స్పోర్ట్స్ కోటా పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు 172 మంది అర్హులైన వారి ఫలితాలను విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : స్పోర్ట్స్కోటాపంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు 172 మంది అర్హులైన వారి ఫలితాలను విడుదల చేసింది. 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం సమయంలో స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. మార్గదర్శకాలపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో స్పోర్ట్స్‌కోటా పోస్టులను భర్తీ చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2021లో ప్రత్యేకంగా స్పోర్ట్స్‌కోటా పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్విడుదల చేశారు. దీనిపై కూడా కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆనాటి నుంచి ఫలితాలను అధికారికంగా ప్రకటించకుండా నిలిపివేశారు. ఇటీవల కోర్టులో పిటిషన్కొట్టివేయడంతో పంచాయతీరాజ్‌శాఖ ఫలితాలను విడుదల చేసింది. వీరికి త్వరలోనే నియామక పత్రాలను అందిస్తారు. ఈ ఫలితాలను https://tspr.tsprrecruitment.in/Results.aspx లో చూసుకోవచ్చని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు.






