- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలి
పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ పెంపు, పదోన్నతులపై ప్రభుత్వానికి వినతి. 4 ఏళ్ల సర్వీస్‌ను సీనియారిటీగా గుర్తించాలని అసోసియేషన్ డిమాండ్.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ ను పెంచి, అర్హులైన అందరికీ వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ డిమాండ్చేసింది. శనివారం అసోసియేషన్ నాయకులు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గా మార్చాలి.
జేపీఎస్‌లుగా పూర్తి చేసిన నాలుగు సంవత్సరాల సర్వీస్‌ను నోషనల్ సీనియారిటీగా పరిగణించి, సర్వీస్ బెనిఫిట్స్ అందించాలి. క్షేత్రస్థాయిలో కార్యదర్శులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, ఇతర పరిపాలనా పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈ. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మధుసుధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్, వాణి, కవిత, కోశాధికారి పండరినాధ్ తదితరులు పాల్గొన్నారు.






