- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యలు కొలిక్కి వచ్చే ఛాన్స్! మంత్రి సీతక్కతో కార్యదర్శుల చర్చలు
పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Panchayat secretaries) పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చ మొదలైంది. సోమవారం సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క (Minister Seethakka)తో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ భేటీ అయ్యింది. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన పాల్గొన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు జరుగుతున్నాయి.
దాదాపు పదివేల మంది పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మే 10న జరిగిన ఫెడరేషన్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి సీతక్క, వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ సచివాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో కార్యదర్శులపై భారం పడుతున్న మాట వాస్తవమేనని మంత్రి సీతక్క కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. పెండింగ్ బిల్లులను విడతల వారీగా చెల్లిస్తామని గతంలో హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అండగా ఉంటుందని గతంలో భరోసా ఇచ్చారు. తాజా చర్చలతో పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కన్పిస్తోంది.






