- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన.. పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ
by Ajay Maddhiboyina |
వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ నియోజకవర్గంలో పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ క్లస్టర్ లో ఉన్న నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ నియోజకవర్గంలో పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ క్లస్టర్ లో ఉన్న నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ పత్రాలు డేటా స్కాన్ చేసి ఉంచామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభ్యర్థులను సముదాయించిన అధికారులు, పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఒరిజినల్ నామినేషన్ పత్రాలు లేకపోవడంతో భద్రతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ పత్రాలను ఎవరు ఎత్తుకుపోయారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story






