నోరు అదుపులో పెట్టుకుంటే మేలు జరుగుతుంది.. ఉగాది వేళ KTR కు పంచాంగ కర్త స్వీట్ వార్నింగ్ (వీడియో)

by Disha Web Desk 2 |
నోరు అదుపులో పెట్టుకుంటే మేలు జరుగుతుంది.. ఉగాది వేళ KTR కు పంచాంగ కర్త స్వీట్ వార్నింగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు ఉగాది పర్వదినం నుంచే కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పరిగణిస్తాం. అయితే, ఉగాది పండుగ అనగానే.. ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున తమ భవిష్యత్తుకు విషయాలను తెలుసుకునేందుకు రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు పంచాంగం చెప్పించుకుంటారు. ముఖ్యంగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు గురించి తెలుసుకోవాలనుకుంటారు. అంతేకాదు.. ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు.

ఈ క్రమంలో ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జాతకం తెలుసుకున్నారు. అయితే, ఈ జాతకంలో పంచాంగకర్త కేటీఆర్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని చెప్పారు. దీంతో ఈ మాటలు విన్న కేటీఆర్ చిన్న చిరునవ్వు నవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా సెటైరికల్‌గా స్పందించింది. ‘‘కేటీఆర్ నోరు మూసుకుని ఉండు.. పంచాంగ శ్రవణంలో పంతులుగారి స్వీట్ వార్నింగ్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Next Story

Most Viewed