CPI: సీపీఐ జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్‌రెడ్డి.. జాతీయ సమితిలోకి రాష్ట్ర నేతలు వీరే!

by Ramesh Naini |

చండీఘడ్‌లో జరిగిన 25 వ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ మహాసభలో తెలంగాణకు చెందిన పలువురు నేతలకు జాతీయ సమితిలో స్థానం కల్పించారు.

CPI: సీపీఐ జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్‌రెడ్డి.. జాతీయ సమితిలోకి రాష్ట్ర నేతలు వీరే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: చండీఘడ్‌లో జరిగిన 25 వ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ మహాసభలో తెలంగాణకు చెందిన పలువురు నేతలకు జాతీయ సమితిలో స్థానం కల్పించారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్‌రెడ్డి (palla venkat reddy) ఎన్నికయ్యారు. అలాగే సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao)కు అవకాశం లభించింది. ఈ నెల 21న ప్రారంభమైన పార్టీ మహాసభలు గురువారంతో ముగిశాయి. ఈ మేరకు 11 మంది సభ్యులు కలిగిన జాతీయ కార్యదర్శి వర్గాన్ని, 31 మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని పార్టీ ఎన్నుకుంది.

మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా, కేంద్ర కమిటీ ఛైర్మన్‌గా కె.నారాయణ నియమించారు. తెలంగాణకు చెందిన ఎండీ యూసుఫ్, ఏపీకి చెందిన పి.దుర్గాభవాని తదితరులు సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌లో సభ్యులుగా స్థానం లభించింది. కాగా, సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావులకు ఇవాళ హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో సీపీఐ సీనియర్‌ నాయకులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, ఈ.టీ.నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్‌, నెల్లికంటి సత్యంలు వారికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాక్షాంలు తెలియజేశారు.

Next Story