కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కల్లా అరుస్తారని, అందుకే వారిని బీఆర్ఎస్‌లో చేర్చుకుని పిల్లుల్ని చేశామని కేసీఆర్ తనతో చెప్పారని హాట్ కామెంట్స్ చేశారు. జనగామ నియోజకవర్గం షోడషపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచినా- కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉద్దేశాన్ని పల్లా వివరించారు. ప్రత్యర్థులకు గిరి గీయకుంటే మనమీదకే వస్తారని.. అందువల్లే వారిని మన పార్టీలో చేర్చుకుని గీతలోపలే ఉంచేయవచ్చని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే జరుగబోతోందన్నారు. జనగామలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ఎవరు కృషి చేస్తారో.. వారికి అవసరమైతే డబ్బులు ఇచ్చి పదవులు ఇప్పిస్తానన్నారు. కాగా, ప్రతిపక్షాలను కేసీఆర్ కుక్కలతో పోల్చారని పల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Next Story