- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలేరు సాగర్ యూటీ పనులు పూర్తి..రేపు నీటి విడుదల
యద్ద ప్రాతిపదికన పాలేరు సాగర్ యూటీ (అంటర్ టన్నెల్) పనులు పూర్తిచేశారు. పనులు పూర్తవ్వడంతో రేపు 1500 క్యూసెక్కుల నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: యద్ద ప్రాతిపదికన పాలేరు సాగర్ యూటీ (అంటర్ టన్నెల్) పనులు పూర్తిచేశారు. పనులు పూర్తవ్వడంతో రేపు 1500 క్యూసెక్కుల నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పొంగులేటితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి హాజరవ్వనున్నారు. ఖమ్మం జిల్లా కూసుంచి మండలం జుజ్జులరావు పేటలో జరుగుతున్న పాలేరు సాగర్ కాలువ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా పొంగులేటి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉంటే గత నెల ప్రాజెక్టును సందర్భించిన మంత్రి పొంగులేటి ఎట్టిపరిస్థితుల్లో జూలై 10వ తేదీ నాటికి యూటీ టన్నెల్ పూర్తి చేసింది వానాకాలం సీజన్‌కు రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని ఆదేశించారు. పనులు పూర్తవ్వడంతో రేపు నీటిని విడుదల చేయనున్నారు. దీని ద్వారా జిల్లాలోని సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.






