- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : పాలమూరు ద్రోహి కేసీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వనపర్తి(Wanaparthy) పర్యటన కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వనపర్తి(Wanaparthy) పర్యటన కొనసాగుతోంది. నేడు వనపర్తిలో ప్రజా పాలన ప్రోగ్రాంలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి అంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన వనపర్తికి, తెలంగాణకు కీర్తి తెచ్చేలా పని చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళలకు పెద్దపీఠ వేసే ప్రభుత్వం అని రేవంత్ తెలియజేశారు. రూ. 1000 కోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు(Solar Power Projects)లు తెలంగాణ మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చామని అన్నారు. ఆడబిడ్డలే స్వయంగా 1000 బస్సులు ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి ఆదాయం పొందేలా ఏర్పాటు చేశామని అన్నారు. ఆదర్శ పాఠశాలలు నిర్వహణ బాధ్యత మహిళలకే ఇవ్వడం నిజం కాదా అన్నారు.
4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma Houses) ఆడబిడ్డల పేరుతో ఇచ్చి, ఇంటికి యాజమానులను చేశామని అన్నారు. కేసీఆర్(KCR) కుటుంబంలో అందరికీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పదవులు ఇచ్చుకున్నారు గాని ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. పాలనలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యానిది, మీ తమ్ముడు రేవంత్ పాలనది అన్నారు. కేసీఆర్ పాలమూరు(Palamuru) ద్రోహి కచ్చితంగా కేసీఆర్ అని సీఎం రేవంత్‌రెడ్డి పడ్డారు. కృష్ణానది జలాలు ఏపీ కొల్లగొడుతుంది అంటే దానికి కారణం కేసీఆర్ అని, పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదని, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ళు SLBC పనులు చేయకపోవడం వల్లే 8 మంది ప్రాణాలు పోయాయి, ఈ పాపం కేసీఆర్ ది కాదా అని నిలదీశారు.
పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దిగిపోవాలని హుకుం జారీ చేస్తున్నారని.. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని, నల్లమల బిడ్డల పౌరుషం ఏంటో చూపిస్తామని, మాతో పెట్టుకుంటే వదిలి పెట్టబోమని బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా కిషన్ రెడ్డి(Kishan Reddy) బీజేపీ ఖాతాలో వేసుకుంటున్నారని.. మరి మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం లేదని, మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వలేదని, సాగు నీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఎందుకు జరపడం లేదని ఆయనని నిలదీశారు. తాము ఒక్క ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇస్తే, మోడీ(PM Modi) ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు.
కేంద్రానికి ఎన్నో వినతులు ఇస్తున్నామని, ఒక్క వినతి మీద కూడా కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించడం లేదు ఎందుకని ప్రశ్నించారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్(Bandi Sanjay) ఇద్దరూ కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతులు వచ్చేలా చేయాలని సవాల్ విసిరారు. కేంద్రం ఈడీ పేరుతో బెదిరించడం తప్పా ఏదీ రాదని.. చావుకు తాము భయపడం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






