- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch elections: ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ట్రిపుల్ షాక్.. స్వగ్రామంలో సైతం ఓటమి
తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి చుక్కెదురు అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి చుక్కెదురు అయింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ట్రిపుల్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో పలు ప్రాంతాలతో పాటు వారి స్వగ్రామంలో సైతం కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో 82 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ గెలుపొందారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల అనుచరుడు కిరణ్ పై, రెబల్ అభ్యర్థి మహేందర్ విజయం పొందారు. అలాగే మడిపల్లి గ్రామంలో వారు బలపరిచిన అభ్యర్థిపై రెబల్ అభ్యర్థి భారీ విజయం సాధించారు. 750 ఓట్ల మెజార్టీతో రామలింగం గెలుపొందారు. అదేవిధంగా సోమారం గ్రామంలో రెబల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్వగ్రామం చెర్లపాలెంలో వారు బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలు అవ్వడం పాలకుర్తి నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.






