- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 230 మంది పాకిస్థానీయులు ఉన్నారు: డీజీపీ
తెలంగాణలో మొత్తం 230 మంది పాకిస్థానీయులు ఉన్నారని డీజీపీ జితేందర్ తెలిపారు. వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మొత్తం 230 మంది పాకిస్థానీయులు ఉన్నారని డీజీపీ జితేందర్ తెలిపారు. వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లడం లేదని, మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని చెప్పారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారిని గుర్తిస్తున్నామని వారు ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోవాలని చెప్పారు.
లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. హెల్త్ బేస్ పై వీసాలు తీసుకున్నవారికి ఈ నెల 29వ తేదీ వరకు ఉండేందుకు సమయం ఉందని తెలిపారు. మిగిలిన వారు రేపు వెళ్లిపోవాలని చెప్పారు. షార్ట్ టర్మ్ వీసాలతో వచ్చి తిరిగి వెళ్లని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తామని అన్నారు. అంతేకాకుండా కర్రెగుట్టలో మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ పోలీసులు పాల్గొనలేదని స్పష్టం చేశారు.






