- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పబ్‌జీ గేమ్‌తో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ.. నేను ఇండియాలోనే ఉంటా అంటూ వీడియో రిలీజ్
నన్ను పాక్ పంపకండి.. నేను భారత్ కోడలిని అని ప్రేమించిన వ్యక్తి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన మహిళ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది.

నన్ను పాక్ పంపకండి.. నేను భారత్ కోడలిని అని ప్రేమించిన వ్యక్తి కోసం పాక్ నుంచి భారత్ వచ్చిన మహిళ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీయులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అయితే, పాక్ దేశస్థురాలైన సీమా హైదర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారంటూ వార్తలొచ్చాయి. దీనిపై ఆమె స్పందించింది. తాను భారత్ కోడలిని అని భారత ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. దయ చేసి తనను ఆ దేశానికి పంపొద్దని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీమా హైదర్ గురించి పూర్తి సమాచారం ఈ లింక్‌లో చూడండి.
దేశంలో జనాభా పెంచాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఇద్దరు పిల్లలు కంటే తక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హత ప్రకటించే విషయంపై ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గతంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హత విధిస్తూ చట్టం తెచ్చానన్నారు. ఇప్పుడు జనాభా పెంపు కోసం ఆ చట్టాన్ని రద్దు చేశామని వెల్లడించారు. ఇక సముద్ర తీర ప్రాంతం ద్వారా సంపద సృష్టించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం ఇంకా పలు సంచలన విషయాలను వెల్లడించారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
జమ్మూకశ్మీర్‌లోని పహెల్గాంలో తామే దాడి చేసినట్లు ప్రకటించిన పాకిస్తాన్‌కు చెందిన టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ తాజాగా మాటమార్చింది. అమాయక ప్రజలపై చేసిన ఉగ్రదాడిని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు ప్రపంచంలోని అగ్ర దేశాల నుంచి మద్దతు పెరిగింది. దీంతో దాడిపై టీఆర్ఎఫ్ మాట మార్చింది. ఈ సందర్భంగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దాంట్లో వాళ్లు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడాల్సిందే.
జిల్లాలో పాలనా వ్యవహారాలు, చట్టాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన కలెక్టర్ హైవేలో తన కారులో రాంగ్ రూట్‌లో వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవాళ కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో దుర్శేడ్ బస్‌స్టాప్ వద్ద కలెక్టర్ కాన్వాయ్ సుమారు 100 మీటర్ల దూరం వరకు హైవేపై రాంగ్ రూట్‌లో వెళ్లింది. కలెక్టర్ వాహనం ఎందుకు రాంగ్ రూట్‌లో వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.






